హీ.. హీ.. హీరోయిజం
వక్కలంక కిషోర్
ABN ANDHRA JYOTHY
ఇది వింత వస్తువుల కథ...
చిటికేస్తే వినగలిగే కుర్చీ...
వేలు చూపిస్తే వెనక్కి వెళ్లే రైలు...
జామెట్రీ తెలిసిన కర్ర ...
పడుకుని ప్రయాణం చేసే గుర్రం ...
ఇది జానపద గాథ కాదు...
వెండితెర బాధ ... హీరోయిజం కథ...
గ్రాఫిక్ తో లాజిక్ మాయం...
హీ.. హీ.. హీ.. హీరోయిజం ...
సాయంత్రం 6.30 కి... హీ... హీ... హీరోయిజం...
--------------------------------------------------------------------------------------------
ఇంట్రో యాంకర్
జానపద సినిమాల టైమ్ అయిపోయింది. అయినా డోంట్‌వర్రీ! కీలుగుర్రాలూ మంత్రదండాలూ లేవు. అయినా నో మెన్షన్! తోటరాముడు ఎన్టీఆర్, మాయలఫకీర్ ఎస్వీఆర్... కత్తియుద్ధ కాంతారావ్ ... ఎవరూ ఇప్పుడు ఫీల్డ్‌లో లేరు. అయినా నో ప్రాబ్లెం..! ఇప్పటి మన హీరోలు ఇంకా పవర్‌ఫుల్. కావడానికి సోషల్ సినిమాలైనా... సైన్స్ మనవాళ్లకి వరాలిచ్చింది. ప్రకృతి శక్తుల్ని కూడా జయించగల మహాశక్తి ని మాస్ హీరోయిజంలో పెట్టేసింది. గ్రాఫిక్‌తో లాజిక్‌ని జయించగల నేర్పు మన డైరెక్టర్లకి ఎలాగా ఉంది. మరి ఇంకెందుకు బాధ?
(బ్యాంగ్)
యాంకర్ వన్
అనగనగా ఒక హీరో. దేవుడి గురించి తపస్సు చేశాడు. వరాలు కోరాడు. గాలిలో ఎగరాలి. కానీ దెబ్బ తగలకూడదు. నేను పదిమందిని షూట్ చెయ్యాలి. కానీ ఒక్క గుండు కూడా నాకు తగలకూడదు. నేను పిలిస్తే కుర్చీ రావాలి. రైలు ఆగాలి. కర్ర విరగాలి. పాము చావాలి. ... ఇలా ఓ యాభై వరాల లిస్ట్ చదివాడు. ముందు దేవుడు గాభరాపడ్డాడు. కానీ చివరికి ఓం గ్రాఫికాయనమహ అనే ఒక మంత్రం చెప్పాడు. ఈగ్రాఫిక్ మంత్రం జపిస్తే నువ్వు అనుకున్నవన్నీ జరుగుతాయి. మాస్ నువ్వంటే ఎగబడతారు. కానీ మితిమీరి వాడితే నవ్వుతారు. యూజ్ చేసుకోవడం నీ చేతిలో ఉందన్నాడు. హీరో డైరెక్టర్ని పిలిచాడు. తను సంపాదించిన మాస్‌క్రేజ్ వరం గురించి చెప్పాడు. ఆ మంత్రం బాధ్యత డైరెక్టర్‌కి అప్పజెప్పాడు. ఆ తరవాత ఏం జరిగిందన్నది ఇదుగో... ఇక వెండి తెరమీద ...సారీ... బుల్లితెరమీదే చూద్దాం...
(బ్యాంగ్)
యాంకర్ వన్ కంటిన్యూ...
క్రాప్ చెరక్కుండా పదిమంది రౌడీల్ని చెడుగుడు ఆడేయడం పాత స్టయిల్. ఇప్పుడు మన హీరోలు అతికి...సారీ.. అతి మానుష చర్యలకి కేరాఫ్ ఎడ్రస్. ప్రకృతి శక్తులు మనవాళ్ల ముందర పనిచేయవు. వీళ్ల దగ్గర కొన్ని వింత వస్తువులు కూడా ఉంటాయి. అవి హీరోకి అవసరమైన పనులు చేసి మళ్లీ సిన్సియర్‌గా హీరో దగ్గరికి తిరిగివచ్చేస్తుంటాయి. వింత వస్తువుల దాకా ఎందుకు? మాస్ హీరోలు మామూలు వస్తువుల్నే వింతగా ఉపయోగించగలుగుతారు..
వాయిస్ వన్
కళ్లజోడు తిప్పడంలోనే కాదు... దాన్ని జేబులో పెట్టడంలో కూడా హీరోయిజం ఉంటే బెటరని మన డైరెక్టర్ల మహాభిప్రాయం. చీటికీ మాటికీ ఓ పవర్‌ఫుల్ డైలాగ్ కూడా చెబుతుండాలి. పవర్‌ఫుల్ డైలాగ్ వల్ల ప్రయోజనం ఏంటనకండి. ఆ పవర్ హీరో నోట్లోంచి వంట్లోకి పాకి, సినీరూల్ ప్రకారం చేతిలోకి వచ్చేస్తుంది. దీనికి ప్రూఫ్ ఏంటని అడగద్దు. ప్రాణం లేని కుర్చీ కూడా ఇందుకు సాక్ష్యం చెబుతుంది.
(స్పాట్... ఇంద్ర కుర్చీ సీన్... డైలాగ్ చెప్పే వరకే...)
యాంకర్ టూ
అన్నట్టు పవర్‌ఫుల్ డైలాగ్ చెప్పి అలసిపోయిన హీరో... కుర్చీమీద కాసేపు రెస్ట్ తీసుకోవాల్సి వచ్చిందనుకోండి. ఒక్కసారి కుప్పకూలితే ఏం బాగుంటుంది. కాలు మీద కాలు వేసుకుని కూర్చుంటేనే స్టయిల్. మరి హీరోకేనేంటి... కుర్చీకి కూడా కాళ్లుంటాయ్. పవర్‌ఫుల్ డైలాగ్స్‌తో పవర్ సంపాదించుకున్న చేతుల్తో ... కండువాని గురిచూసి విసిరితే అది కుర్చీకాలుకి తగులుకుంటుంది. లాగితే విలన్ పక్కనుంచి ప్రయాణం స్టార్ట్ చేసి, గ్రాఫిటేషన్ ఫోర్స్ ప్రకారం సరిగ్గా హీరో బ్యాక్‌కి వచ్చి ఆగుతుంది. అంత కరెక్ట్‌గా ఎందుకొస్తుంది అంటే దానికీ ఆన్సరుంది. అసలు కూర్చునేటప్పుడు హీరో కుర్చీ కేసి చూడడు. అలా చూస్తే హీరోయిజం తగ్గిపోతుంది కదా? మరి చూడకుండా కూర్చునేటప్పుడు వెనక కుర్చీ సరయిన పొజిషన్లో లేకపోతే... అంతే మరి! అందుకే కుర్చీ లాగగానే అటూ ఇటూ కాకుండా సరిగ్గా హీరో వెనక్కి వచ్చి ఆగుతుంది... ఇదుగో చూడండి మరి...
( స్పాట్.. ఇంద్ర కుర్చీ సీన్... కుర్చీ లాగి కూర్చోవడం... )
యాంకర్ త్రీ
వెరీ బ్యాడ్... వెరీ బ్యాడ్... ఏంటి బ్యాడ్? కుర్చీ రావడమా? బాగానే వచ్చిందిగా? కుర్చీ రావడం గురించి కాదు... హీరో లాగడం గురించి... గొప్పవాడయిన హీరో ... అద్భుతమైన పనుల్ని అవలీలగా చేయగల హీరో ... ఆఫ్ట్రాల్ ఓ కుర్చీ లాగడానికి పవర్‌ఫుల్ డైలాగ్ చెప్పడం... కష్టపడి కండువా తీసి విసరడం... ఇదంతా ఏం బాలేదంటారు కొందరు. వాళ్ల దృష్టిలో హీరో ఇంకా పవర్‌ఫుల్‌గా ఉండాలి మరి!
గోడలకి చెవులుంటాయ్ అని విన్నాం. కానీ మీకు తెలుసా? కుర్చీలకి కూడా చెవులుంటాయ్. చిటుక్కుమన్న శబ్దం వచ్చినా అవి వినగలుగుతాయి. ఈ సంగతి హీరోకి మాత్రమే తెలుసు. హీరో చిటికె శబ్దం వింటే చాలు.. ఎంతటి కుర్చీ అయినా పరిగెత్తి రావాల్సిందే!
వాయిస్ త్రీ
హీరో పవర్‌ఫుల్ అనిపించుకోవడానికి ఈ కుర్చీ సీన్లో మూడు ఎడ్జెస్ట్‌మెంట్స్ కనిపిస్తాయి. ఇవి ఎడ్జస్ట్‌మెంట్లనే కంటే... హీరోయిజాన్ని పెంచే ఎన్‌హాన్స్‌మెంట్లంటే సరిపోతుంది...
ఎన్‌హాన్స్‌మెంట్ నంబర్ వన్... పవర్‌ఫుల్ డైలాగ్ చెప్పి నీరసం వచ్చి హీరో కుర్చీలో కూలబడడం కంటే.. హీరో దెబ్బ పవర్‌కి విలనే కూలబడితే హీరోయిజం ఇంకా పెరుగుతుంది.
ఎన్‌హాన్స్‌మెంట్ నంబర్ టూ... పవర్‌ఫుల్ డైలాగ్ చెప్పగానే సినీరూల్ ప్రకారం ఆ పవర్ హీరో చేతిలోకి ఎలాగా వచ్చేస్తుంది కాబట్టి... మళ్లీ కండువాలూ అవీ తీయకుండా జస్ట్ చిటికేస్తే సరిపోతుంది. అఫ్‌కోర్స్ దానికి ముందు తొడకొడితే మరీ మంచిది.
ఎన్‌హాన్స్‌మెంట్ నంబర్ త్రీ... హీరో చిటికేసి పిలిస్తే ఖాళీ కుర్చీ రావడం కాదు. అందులో హీరోయిజం తక్కువ. సహేంద్ర తక్షకాయ స్వాహా అన్నట్టు - ఎంతో బరువున్న విలన్ కూర్చున్నప్పటికీ... అతనితో సహా కుర్చీ కుక్కలా మాట వినడం... హీరో చిటికె వాల్యూని పెంచుతుంది.
చిటికేస్తే కుర్చీ రావడమా? ఇది ఎలా పాజిబుల్ అని అడక్కండి. అయినా భలే ఉన్నారే! లాజిక్ కావాలా? హీరోయిజం కావాలా? అవ్వాకావాలి బువ్వా కావాలంటే కుదరదు. ఏదో ఒకటే పాజిబుల్.
( స్పాట్... బాలకృష్ణ... కుర్చీ ని పిలవడం... )
యాంకర్ ఫోర్
ఒక్కభార్య ఉన్నవాడు దేవుడే... మరి అష్టభార్యలున్నవాడూ దేవుడే - అన్నట్టు... కుర్చీలో కూర్చున్నా హీరోయిజమే! కుర్చీని రమ్మని పిలిచినా హీరోయిజమే! ఇలా కుర్చీలతో హీరోయిజాన్ని పెంచుకునే హీరోని ఆ కుర్చీలోనే కట్టేస్తే ఏమవుతుంది? ... క్లైమాక్స్ టెన్షన్ మొదలవుతుంది.
వాయిస్ ఫోర్
క్లైమాక్స్‌లో విలన్ డ్యూటీ పారిపోవడమే కాదు. తను పారిపోవడమే కాదు, దొరికిన హీరోని కాల్చి పారేయకుండా అతను తప్పించుకోవడానికి తగినంత టైమ్ ఇవ్వని వాడు విలనే కాడు. మరి హీరోని కుర్చీకి కట్టేసి, టైమ్ బాంబ్ పెట్టేసి ప్రమాదంలో వదిలేసి విలన్ పారిపోతాడు. తన డ్యూటీని విలన్ ఇంత కరెక్ట్‌గా చేశాక హీరో మాత్రం ఊరుకుంటాడా? చేతులు కట్టేసినా చేతకానివాడేం కాదుగా? తుపుక్ తుపుక్ అంటూ నోటితోనే తుపాకీ గుళ్లు కురిపిస్తాడు. పేలబోయే బాంబుని ఉమ్మి వేసి ఆపడం.. హీరోకి పెద్ద కష్టమేం కాదు. అసలు చేత్తో షూట్ చేయడం కంటే నోటితో షూట్ చెయ్యడమే కష్టం మరి!
(బుల్లెట్‌తో ఆపడం ... అల్లరి పిడుగు సీన్)
యాంకర్ ఫైవ్
అన్యాయాన్ని ఎదుర్కొనేవాడు హీరో. న్యాయానికి భయపడి అన్యాయం పారిపోతుంటే... తరిమి తరిమి కొట్టేవాడే హీరో. అయితే ప్రతీ చిన్నా చితకా ఆకురౌడీ వెనకా హీరో పరుగులు తీస్తే ఏం బాగుంటుంది?
ఈ చిన్న రౌడీల్ని తరిమేటందుకే సోడాలున్నాయి..
వాయిస్ ఓవర్ ఫైవ్
గుండె గొంతుకలోన కొట్లాడుతాది.. అని ఒకాయన కవిత రాస్తే.. అది సోడా గురించే అన్నాడు ఓ కార్టూనిస్ట్. ఎందుకంటే... సోడాకాయ గుండె గోళీ... దాని గొంతుకలోనే కొట్టాడుతూ ఉంటుంది మరి! గుండెని గొంతుకలో పెట్టుకున్న సోడాకి... హీరోగారి హృదయం తెలుసుకోవడం పెద్ద కష్టం కాదు. ఎంత బిజీ రోడ్డులో ఉన్నా.. అడ్డంగా ఎందరున్నా ... ఎవరిని కొట్టాలో తెలుసుకుని ఎంతదూరమైనా వెళ్లి... టార్గెట్ ఛేదించడం.. సినీ సోడాబుడ్డి కనీస కర్తవ్యం.. అయితే ఈ సోడా సక్సెస్‌ని మాత్రం హీరోయిన్ హీరోకే ఎట్రిబ్యూట్ చేస్తుంది. అది ఆమె కర్తవ్యం.
(సోడాతో కొట్టే సీన్ ... అరుణాచలం... రజనీకాంత్)
యాంకర్ సిక్స్
పరిగెత్తి పోయే రౌడీ ఎంత స్పీడుతో వెళ్తున్నాడో అంచనావేయడం హీరోకి పెద్ద కష్టం కాదు. అందులోనూ మాటవినే సోడా బుడ్డి చేతిలో ఉన్నప్పుడు... టార్గెట్ చేసి కొట్టడం పెద్ద విషయం కాదు. కానీ కర్ణ పిశాచో.. జాతకమార్తాండమో... ముందే లెక్కేసి చెప్పినట్టు... ఏ వస్తువు ఏ సమయంలో ఏ ప్లేసులో ఉండబోతోందో... ముందే ఊహించి టార్గెట్ ఛేదించడం ... అదీ అసలైన కష్టం!
వాయిస్ ఓవర్ సిక్స్
అర్జునుడు మత్స్యయంత్రాన్ని ఛేదించినపుడు అందరూ తెగ పొగిడేశార్ట. అప్పటికి సినిమాలు లేవు మరి!
విలన్ ఛాలెంజ్ చేసినపుడు హీరో తన సత్తా చూపించాలి. అదే హీరోయిన్ ఛాలెంజ్ చేసినప్పుడు ఇంకా పవర్‌ఫుల్‌గా ఉండాలి. అలా ఛాలెంజ్ చేసిన హీరోయిన్ హఠాత్తుగా డిసీవ్ చేస్తే...? సులువనుకున్న టార్గెట్ కష్టంగా మారిపోతే? ... ఊహించనిది జరిగినా హీరో బెంబేలుపడిపోడు. ఎవరి ఊహకీ అందని విధంగా ఏదోలా సమస్య సాల్వ్ చేస్తాడు....
(అంజి చిరంజీవి విల్లు సీన్)
యాంకర్ సెవెన్
కనీవినీ ఎరుగని టైమ్‌సెన్స్‌తో టార్గెట్ ఛేదించడం గొప్ప విషయం. కానీ ... టైమ్‌సెన్స్ ఉన్న సోడాబుడ్డి, చెప్పినట్టు ఎగిరే గాజులు... ఇలాంటి వింత వస్తువులు చేతిలో ఉన్నప్పుడు ... ఎంతటి టార్గెట్‌నైనా ఇట్టే ఛేదించచ్చు. అయితే మన హీరోల దగ్గర ఇంతకంటే గొప్ప వస్తువులు కూడా ఉంటాయి. వాటి సంగతి చూద్దాం.
వాయిస్ సెవెన్
ఇది హీరోగారి బూటు. రామబాణం రాముడికంటే గొప్పదన్నట్టు... ఒకోసారి సినిమా తెరమీద హీరో కంటే ముందు ఈ బూటుగారి దర్శనమే అవుతుంది. హీరోని చాలాసేపు చూపించకుండా బూట్లే చూపిస్తూ హీరోయిజం పెంచేసే బిగ్‌డైరెక్టర్లు మనకున్నారు. స్విచ్ వేస్తే కంప్యూటర్ బూట్ అయినట్టు... కొన్ని సినిమాల్లో బూట్ తోనే హీరోయిజం బూట్ అవుతుంది. బూటుగారి పవర్‌కి భూమి దద్దరిల్లిపోతుంది. దీని కదలిక ఆ గాలినే శాసిస్తుంది.
(చంద్రముఖి .. రజనీ కాంత్ ఎంట్రన్స్ సీన్ ...)
యాంకర్ ఎయిట్
గాలిని శాసించే బూటు కంటే బూమరాంగ్ బూటు గొప్పది. దానికి వినయం ఎక్కువ. ఛీ... బూటుకి వినయం ఏమిటి? అనకండి. అదంతే! బూమరాంగ్ అనే పేరు విన్నారా? కొంచెం ఎల్ షేపులో ఉంటుంది. దాన్ని విసిరితే టార్గెట్‌ని కొట్టి... తిరిగి చేతికి వస్తుంది. బూమరాంగ్ బూటు కూడా అంతే!
వాయిస్ ఎయిట్
ప్రాణం లేని వస్తువు కూడా హీరోమాట వింటుంది. అదే రియల్ హీరోయిజం అంటే! హీరో క్లైమాక్స్‌లో కష్టపడాలిగానీ... రీలురీలుకీ ఆయాసపడిపోతే ఏం బాగుంటుంది? అందుకే ... ఒకోసారి విలన్లని కొట్టడానికి సింపుల్‌గా బూట్ ఉపయోగిస్తూ ఉంటుంది. అది తన కర్తవ్యాన్ని నిర్వహించి.. తిరిగి వినయంగా హీరో చరణ కమలాల్ని చేరుకుంటుంది.
(బాబా బూట్ సీన్ ..)
యాంకర్ నైన్
బూటులాగే హీరో చేతిలో ఉండే కర్రకూడా మాట వింటుంది. కానీ హీరో బూటుకంటే హీరో కర్ర గొప్పది. ఎందుకంటే దానికి జామెట్రీ తెలుసు.
వాయిస్ నైన్
చిన్నప్పుడు కంపాస్‌బాక్స్ వాడారు కదా? అందులో.. సర్కిల్స్ గీయడానికి వృత్త లేఖిని అని ఉంటుంది. గుర్తుందా? ఓ పక్క ముల్లు .. మరోపక్క పెన్సిలు... పేపరు మీద ముల్లు గుచ్చితే... సెంటర్ తెలుసుకుని కరెక్ట్‌గా సర్కిల్ గీస్తుంది. కానీ ఈ కర్ర కాంపాస్‌బాక్స్‌లో పట్టదుగానీ... అంతకంటే కరెక్ట్‌గా పనిచేస్తుంది.
మనకి హీరోయే సెంటరాఫ్ ఎట్రాక్షన్ కాబట్టి... హీరోనే సెంటర్ పాయింట్ చేసుకుంటుంది.
మనకి హీరోయే సెంటరాఫ్ ఎట్రాక్షన్ కాబట్టి... హీరోనే సెంటర్ పాయింట్ చేసుకోవాలని రూలేం లేదు.
(కర్రతో లైన్ గీయడం... అరుణాచలం...)
ఆయుధాల్ని విలన్ల మీదకి పంపించడంలోనే కాదు... విలన్ తన మీదకి వాడే ఆయుధాల విషయంలో కూడా ఎలర్ట్‌గా ఉంటాడు హీరో. కత్తి అయినా సరే... హీరో నోటి దగ్గరికి వచ్చేసరికి పదును కోల్పోయి... హీరోయిజానికి పట్టుబడిపోతుంది.
(కత్తి విసిరితే నోటితో పట్టుకోవడం... అరుణాచలం...)
యాంకర్ టెన్
సో... బూట్లు, కర్రలు, కత్తులు.. హీరోలని గౌరవిస్తాయన్న విషయాన్ని తెలుసుకున్నాం. కానీ పాపం.. అదేంటో.. విలన్లు హీరోని గౌరవించరు. అవును మరి. వాళ్లు కూడా హీరోని గౌరవించేస్తే కథ నడవదు . కానీ జనం హీరోని విపరీతంగా గౌరవించాలి. లేకపోతే హీరోయిజమే ఉండదు. మరి ఇలాంటి ధర్మసంకటం ఏర్పడ్డ సిట్యుయేషన్లో ఏం చేయాలి?
వాయిస్ టెన్
ఇతర కారెక్టర్లు ఎవరూ తనని గౌరవించకపోతే హీరో సరే అని ఎడ్జస్ట్ అయిపోవాలా? నెవర్. ఏమాత్రం మొహమాటపడకుండా తనని తనే గౌరవించుకోవాలి. ఇదే హీరో ధర్మం. ఈ ధర్మరక్షణకోసం, సొంతగౌరవాన్ని కాపాడుకోవడంకోసం తన మానవాతీత శక్తుల్ని కూడా ఉపయోగించుకోవచ్చు. మాస్ ఇమేజ్ మాత్రం దెబ్బతినకూడదు. కూర్చోడానికి కుర్చీ ఆఫర్ చెయ్యకపోతే ఊయల్ని లాక్కోవాలి. అఫ్‌కోర్స్ ... పొరబాటు జరిగితే నెత్తి పగిలిపోతుందనుకోండి... అయినా హీరో కాబట్టి పొరబాటు జరగనే జరగదు!
( సీట్ లేకపోతే... ఊయల లాగే... నరసింహ సీన్)
యాంకర్ లెవెన్
ఊయల లాగడం మంచి టెక్నిక్కే ... కానీ హీరోయిజం కొంచెం దెబ్బతిన్నట్టే ! అవునుమరి. హీరో కష్టపడ్డాడు. గొలుసు లాగాడు. ఉయ్యాలవేసుక్కూర్చున్నాడు. ఇందులో పెద్ద హీరోయిజం ఏముంది? అసలు.. హీరో చెయ్యి మాత్రమే కాదు... ప్రతి వేలూ పవర్‌ఫుల్‌గా ఉండాలి. ఆ వేలు కూడా జస్ట్... చూపిస్తే చాలు... పనులు జరిగిపోవాలి.
వాయిస్ లెవెన్
కొందరు అమాయకులు రైలు ఎప్పుడూ ముందుకే పోతుందని అనుకుంటూ ఉంటారు. అలాంటి మూర్ఖులతో మనకి పని లేదు. పట్టాల మీద పరిగెత్తే రైలైనా సరే! పవర్‌ఫుల్ డైలాగ్ చెబితే బెదిరిపోవాలి. వేలు చూపిస్తే మెయిలైనా వెనక్కిపోవాలి! చెన్నకేశవుడి పేరు చెబితే చెన్నై ఎక్స్‌ప్రెస్సయినా రివర్స్ అయిపోవాలి! జై చెన్నకేశవా!
( రైలుని వెనక్కి పంపే సీన్... పలనాటి బ్రహ్మనాయుడు)
యాంకర్ ట్వెల్వ్
మీకు తెలుసా? చీమ చిన్నదనుకుంటాం గానీ... దానికో స్పెషాలిటీ ఉంది. ఈ ప్రపంచంలో చాలా జీవులు తమ బరువుతో సమానమైన బరువు మోయలేవు. కానీ చీమ అలా కాదు. తనకంటే ఎక్కువ బరువుని కూడా ఈజీగా మోయగలదు. యాంట్ పవర్‌ని హీరో ఎడాప్ట్ చేసుకుంటే ఎలా ఉంటుందో ఊహించండి...
సినీ హీరో గురించి చెప్పమంటే చీమల గోలేంటబ్బా? యాంట్ పవర్‌ని ఎడాప్ట్ చేసుకోవడం ఏంటి? ... అదేమరి... సాలీడు పవరూ, గబ్బిలం పవరూ హీరోకి ఎడాప్ట్ చేస్తే ... ఇంగ్లీష్‌లో తీస్తే ఎగురుకుంటూ వెళ్లి చూస్తారు. మరి చీమ పవర్‌తో మన హీరోలు ... రౌడీల్ని పైకి లేపేస్తే తప్పేంటి?
వాయిస్ ట్వెల్వ్
హీరోముందు విలన్లు ఎంత వీకైనా ఒకోసారి వాళ్ల గెడ్డం చాలా బలంగా ఉంటుంది. సింగిల్ హ్యాండ్‌తో పట్టుకుని హీరో పైకి లేపేసినా ... గెడ్డం దగ్గర నొప్పి పుట్టదు. హాయిగా గాలిలో లేచిపోతూ ఉంటారు. అయినా హీరోకి గ్రావిటేషన్ సూత్రాలు మార్చగల శక్తి ఉంటుంది . కాబట్టి... భూమ్యాకర్షణ , E = mc square సూత్రాలు... బయట చెప్పుకోండి . స్క్రీన్‌మీద మాత్రం చెల్లవు.
(ఒంటి చేత్తో మనిషిని ఎత్తడం ... స్టాలిన్... )
యాంకర్‌థర్టీన్
చెప్పాంగా? గ్రాఫిక్ పవర్‌తో గ్రావిటేషనల్ సూత్రాలు మారతాయని! ఇప్పుడు ఫ్రిక్షన్ సూత్రాల గురించి చెప్పుకుందాం . ... ఘర్షణ తెలుసుకదా ? అబ్బే... మణిరత్నం ఘర్షణా , వెంకటేష్ ఘర్షణా కాదు... ఫ్రిక్షన్... ఇది ఓ ప్రకృతి శక్తి ... కదిలే ఏ వస్తువైనా .. కాసేపటికి దానంతట అదే ఆగిపోతుంది. ఇది ప్రకృతి రూలు. కానీ ఈ రూల్ హీరో చేతికి మాత్రం వర్తించదు. ఎందుకంటే విలన్లతో హీరో ఘర్షణ పడేటప్పుడు ప్రకృతి సూత్రాలు మరిచిపోకపోతే హీరోయిజం పండదు .
వాయిస్ థర్టీన్
ప్రకృతికి రూల్స్ ఉంటాయ్. అలాగే గేమ్‌కీ రూల్స్ ఉంటాయ్... ప్రకృతి రూల్స్‌ని హీరోయిజంతో గెలిచినవాడు... ఏ గేమ్‌లోనైనా రూల్ తప్పకుండా గెలిచేయగలడు. ఆగకుండా బంతిని ఎన్ని సంవత్సరాలైనా తిప్పగలడు.
(బంతి గిరగిర తిప్పడం ... బాబా ఫైట్ )
యాంకర్ ఫోర్టీన్
లారీ మీద ప్రయాణించడం రొటీన్. లారీ కింద ప్రయాణించడం వెరైటీ. రోడ్డుమీద తిన్నగా వెళ్లడం రొటీన్. అడ్డంగా వెళ్లడం వెరైటీ. ఈ వెరైటీ హీరోయిజం ఏమిటో చూద్దాం...
వాయిస్ ఫోర్టీన్
మన మూర్ఖత్వం గానీ... హీరోకీ, హీరో వాడే వస్తువులకీ పవరుండగా లేనిది... హీరో ఉపయోగించే గుర్రానికి ఉండదని ఎలా అనుకుంటాం? గుర్రం రోడ్డుకి అడ్డంగా వెళ్లగలదు.. లారీ కిందనుంచి కూడా హాయిగా ప్రయాణం చెయ్యగలదు. ... ఎందుకంటే సింగిల్ రీజన్.. అది హీరోగారి అశ్వము!
(గుర్రంతో లారీ కిందనుంచి...)
యాంకర్ ఫిఫ్టీన్
వాహనములు రెండు రకములు. జీవమున్నవి. జీవము లేనివి. జీవమున్న గుర్రం జీవం లేని లారీ కిందనించి ప్రయాణం చెయ్యడం చూశాం. మరి జీవం లేని బైక్‌తో జీవం లేని రైలు మీద ప్రయాణం చెయ్యడం ఇప్పుడు చూద్దాం.
వాయిస్ ఫిఫ్టీన్
పరిగెట్టే రైలు మీంచి జంప్ చేయాలంటే ... జనరల్‌గా ఇటునించి అటు ... అంటే అడ్డంగా జంప్ చేస్తారు. కానీ అది రొటీన్ ... హీరోయిజం ఇంటెన్సిటీ పెరగాలన్నప్పుడు అది చాలదు. రైలుమీంచి నిలువుగా జంప్‌చేయాలి. హీరో నడిపే బైక్ రైలు కంటే వేగంగా వెళ్తుంది కాబట్టి... తోకనుంచి మొదలుపెట్టి డైరెక్ట్‌గా రైలు ముందుకెళ్లిపోవచ్చు.
(రైలు దాటడం... విజయేంద్రవర్మ సీన్)
యాంకర్ సిక్స్‌టీన్
హీరో విలన్ ఎప్పుడూ ఈక్వల్ కారు. పదిమంది రౌడీలు కలిసినా హీరోతో ఈక్వల్ కారు. మరి రెండు పక్కలా ఈక్వల్‌గా ఉన్నప్పుడే కదా ఫైటింగ్‌లో మజా? రౌడీల పవర్ ఎలాగూ పెంచలేం. సో... హీరో పవర్ తగ్గిస్తే ఎలా ఉంటుంది? అది కూడా హీరోయిజంకి హెల్ప్ చేస్తుంది. అదే తమాషా!
వాయిస్ సిక్స్‌టీన్
మామూలుగా కొడితే మజా ఏముంది? మాస్ హీరో గొప్పతనం ఏముంది? నేలమీద కాలు పెట్టకుండా కొట్టాలని నియమం పెట్టుకుంటే... హీరోయిజం ఎలివేట్ అవుతుంది. పొరబాట్న ఎప్పుడైనా ఏ కుండ మీదో కాలు పెట్టినా... అది పగిలినా... హీరో కాలు నేలకి తగలదు. బోర్లించి ఉన్న కుండ కింద ఓ గ్లాసుంటుంది. హీరోవి ఎక్స్‌రే కళ్లా? సిక్స్‌త్ సెన్సా? అని వెర్రిప్రశ్నలు వేయకుండా ఎంజాయ్ చెయ్యడమే ప్రేక్షకుడి డ్యూటీ!
(ఫైట్‌లో కాలు కిందపెట్టకుండా కొట్టడం ... కొండవీటి రాజా )
యాంకర్ సిక్స్‌టీన్
గుండుకి గుండె చూపిన వాడే హీరో...మాస్ హీరోని గుండేసి పేల్చినా చావడు. చస్తే గిస్తే ఆ పేల్చినవాడే చావాలి. అది సినిమారూల్.
వాయిస్ సిక్స్‌టీన్
హీరో విజయం కోసం ప్రకృతి సూత్రాలు మార్చినా పరవాలేదని మనకి తెలుసు. అంతే కాదు. ఒకోసారి ఒకో వస్తు లక్షణాన్ని ఇంకో దానికి అప్లై చేయాల్సి రావచ్చు కూడా! ఫరెగ్జాంపుల్... పరావర్తనం అనే కాంతి లక్షణాన్ని తుపాకి గుండుకి అప్లై చేస్తే ఎలా ఉంటుందో చూడండి...
( బుల్లెట్ వెనక్కి తిరిగి విలన్నే షూట్ చేయడం ... విజయకాంత్ బిట్... )
చేతకాని విలన్లు షూట్ చేస్తే ... ఇదిగో ఇలాగే ఉంటుంది.. అదే మాంచి హీరోయిజం తో షూట్ చేస్తే విమానం చక్రాలైనా గ్రాఫిక్ ముక్కల్లా ఊడి పడిపోతాయి.
( విమానాన్ని పేల్చడం ... చక్రాలు ఊడిపోవడం... విజయేంద్రవర్మ ... )
తుపాకి గుండు వెనక్కి తిరిగి వెళ్లడం ఎలా సాధ్యం అనకండి. దీనికే ఇలా అంటే... మరి దీని సంగతేంటి?
( గుండు ఎదురుగా రజని నడిచే సీన్ ... శివాజీ సీన్)
ఇప్పుడర్థమైందా? హీరోముందు ఎవరి ఎత్తులూ సాగవు. ఏ లాజిక్కులూ పని చేయవు.
యాంకర్ సెవెన్‌టీన్
కుట్టుట మూడు రకములు. బట్టలు కుట్టుట. తేళ్లూజెర్రులూ కుట్టుట, కన్నుకుట్టుట... అంటాడు లేడీస్ టైలర్. అలాగే షూటింగ్ రెండు రకములు అని హీరోలూ నిరూపించారు. షూటింగే కాదు. సిగరెట్ షూటింగ్... అదేనండీ ... సిగరెట్ కాల్చుట కూడా రెండు రకములు.
వాయిస్ సెవెన్‌టీన్
దోమని వట్టి చేతుల్తో చంపేస్తే గొప్పేముంది? దాన్ని పట్టుకుని ... తాడుతో కట్టేసి... దాని నోట్లో సూటిగా ఒక్క విషం చుక్క వేస్తే చచ్చూరుకుంటుంది. అదీ స్టయిల్. సిగరెట్ మామూలుగా కాలిస్తే మాస్ హీరో గొప్పేముంది?
( గాలిలో సిగరెట్ ఎగరేసి కాల్చడం ... వరకూ... రజనీ కాంత్ గిరఫ్‌తార్)
చూశారుగా హీరో ఎంత చాకచక్యంగా ఉంటాడో! అన్నట్టు మీకో రహస్యం తెలుసా? ఈ ప్రపంచంలో హీరో ఒక్కడే చాకచక్యం గలవాడు. విలన్లు చవటలు. హీరో అవకాశం ఇచ్చినా వాళ్లు ఉపయోగించుకోలేరు. వారి అసమర్థత... హీరో గారి ఔదార్యం ... హీరో సమర్థత... అన్నీ అందుకే ఎలివేట్ అయిపోతుంటాయి.
(అవకాశం ఇచ్చినా తుపాకి తిరిగి తీసుకోవడం ... గిరఫ్‌తార్... కంటిన్యుయేషన్ )
యాంకర్ ఎయిటీన్
మొదట్లో చెప్పిన కథ గుర్తుంది కదా? దీనికంతటికీ కారణం తెలుసుకదా? ఓం గ్రాఫికాయనమహ అన్న మంత్ర ప్రభావం!
హాలీవుడ్ మూవీ లెవెల్లో బిల్డప్... కష్టపడి క్లిఫ్ హ్యాంగర్ లెవెల్లో కొండెక్కి... చివరికి కుందేల్ని పట్టుకోవడం... మాస్‌హీరోయిజంలో ఇలా నిరాశ పరిస్తే ఎలా?
(కొండెక్కి కుందేలు పట్టడం... విజయేంద్రవర్మ)
-----------------------
ఎండ్ యాంకర్
మొదట్లో చెప్పిన కథ గుర్తుందా? దేవుడిచ్చిన గ్రాఫిక్ మంత్రం జ్ఞాపకం ఉందా? ఓం గ్రాఫికాయనమహ.. అన్నీ గుర్తున్నాయి. కానీ మితిమీరి వాడద్దన్న దేవుడి హెచ్చరికే గుర్తులేదు.
ఎస్... మన హీరోల తప్పేం లేదు. దేవుడి హెచ్చరికని మరిచిపోయి... డైరెక్టర్లే ఈ మంత్రం అతిగా జపిస్తున్నారు. తాము పట్టిన కుందేళ్లకి మూడే కాళ్లంటున్నారు. హీరోయిజం పేరుతో మన కథానాయకుల చేత ఎన్ని సాహసాలు చేయించినా ... లాజిక్ అన్నది మిస్సయితే ... కొండని తవ్వి ఎలకని పట్టినట్టు ... కొండెక్కి కుందేలుని పట్టినట్టూ... ఉంటుంది. హీరోయిజం కొండెక్కిపోతుంది...
--------------------
Home � � heheHeroism
heheHeroism
Posted by Kishor on 8:39 AM // 0 comments
0 comments to "heheHeroism"
Post a Comment